శ్రీకృష్ణ కమిటీకి ఊరట, 8వ అధ్యాయం వెల్లడిపై హైకోర్టు స్టే

కమిటీ ఎనిమిదో అధ్యాయాన్ని సీల్డు కవరులో తమకు అందించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటైంది. తన నివేదికలోని ఎనిమిదో అధ్యాయాన్ని కమిటీ సీల్డు కవర్‌లో కేంద్ర హోం మంత్రి చిదంబరానికి అందజేసింది. దాని బహిర్గతం చేయరాదని కోరింది.












Click it and Unblock the Notifications