విద్యార్థినిపై నెలల తరబడి అత్యాచారం, లేడీ వార్డెన్ ఎదుటే రాక్షసం

ఎడ తెరిపి లేని బ్లాక్ మెయిలింగ్, రేప్‌లకు విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జుంజును ప్రాంతానికి చెందిన విద్యార్థిని 2010 జూన్‌లో ప్రైవేట్ కాలేజీలో చేరింది. హాస్టల్ యజమానులు ఆమె తల్లిదండ్రులు తెలిసి ఉండడంతో ఆమె అందులో చేరింది. మొదట చాలా బాగా వ్యవహరించిన హాస్టల్ యజమానులు ఓ రోజు గదిలోకి తీసుకుని వెళ్లి విద్యార్థినిపై అత్యాచారం జరిపారు.
రేప్ చేస్తున్నప్పుడు నిందితులు వీడియో ఫుటేజ్ కూడా తీశారు. వీడియోను బయట పెడతామని బెదిరిస్తూ పలు చోట్ల ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చారు. విద్యార్థి తండ్రి సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. దీంతో స్థానికంగా ఆమెకు సంరక్షకులు ఎవరూ లేకుండా పోయారు.












Click it and Unblock the Notifications