మా పార్టీలో చేరండి, లేదంటే...: కడపలో ఓ పార్టీ నేత హల్‌చల్

ఉప ఎన్నికల తర్వాత ప్రభుత్వం పడిపోయి ఆ తర్వాత ఎన్నికలు వస్తాయని, అప్పుడు తమ పార్టీ ప్రభుత్వమే ఏర్పడుతుందని అప్పుడు తమ పార్టీకి ఓటు వేయని వారికి రేషన్ కార్డులు, పింఛన్లు, గృహాలను అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని ఓటర్లకు హెచ్చరికలు పంపుతున్నాడని సమాచారం. అంతేకాదు ప్రత్యర్థి రెండు పార్టీలలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బలహీనంగా ఉన్నచోట ఏజెంట్లుగా కూర్చోకూడదని హెచ్చరికలు పంపిస్తున్నారంట. ఏజెంట్లుగా కూర్చుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు పాల్పడుతున్నారంట.
మరికొన్ని ప్రాంతాలలో ఎవరూ వేరే పార్టీలోకి చేరవద్దని హెచ్చరికలు పంపిస్తున్నాడంట. ఉంటే తటస్థంగా ఉండండి. లేదంటే మా పార్టీలో చేరండి. ఇతర పార్టీలలో చేరితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నాడంట. అయితే ఇతని చర్యలను ఈసీ దృష్టికి తీసుకు వెళ్లాలని ఇతర పార్టీల కార్యకర్తలు నిశ్చయించుకున్నప్పటికీ ఆ తర్వాత ఏమవుతుందోననే భయంతో వెనక్కి తగ్గారంట.












Click it and Unblock the Notifications