వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యజిత్‌ను టార్గెట్ చేసిన ఆదికేశవులునాయుడు, ప్రభుత్వానికి వినతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Adikesavulu Naidu
పుట్టపర్తి: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు పుట్టపర్తి సత్య సాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్‌ను టార్గెట్ చేశారు. సత్య సాయి బాబాకు వైద్య సేవలు అందిస్తున్న సమయంలో ఐసియులోకి సత్యజిత్‌ను ఎలా అనుమతించారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. కుటుంబ సభ్యులను కూడా అనుమతించనివారు సత్యజిత్‌ను ఎందుకు ఐసియులోకి అనుమతించారని ఆయన అడిగారు. సత్య సాయిని గత నెల 28వ తేదీన ఆస్పత్రిలో చేర్చడానికి ముందు ఏం జరిగిందనే విషయంపై ప్రభుత్వం విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. సత్యజిత్ వైద్యుడు కారని, అయినా ఐసియులో ఉండనిచ్చారని ఆయన అన్నారు.

చెక్ పవర్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై సత్య సాయి సెంట్రల్ ట్రస్టు నిర్ణయం తీసుకుంటుందని, సత్య సాయి బాబా సోదరుడు జానకీరామయ్య కుమారుడు రత్నాకర్ కోసం తాను లాబీయింగ్ చేయడం లేదని ఆయన చెప్పారు. ట్రస్టు సత్య సాయిబాబా ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలను కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. ట్రస్టు సభ్యుడిగా ఉండాలని తనకు ఏమీ లేదని ఆయన చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే సత్య సాయి ఆరోగ్యం చెడిపోయిందని, సకాలంలో స్పందించి ఉంటే సత్య సాయిని కాపాడుకుని ఉండేవాళ్లమని ఆయన అన్నారు.

English summary
TTD former chairman Adikesavulu Naidu targeted Sathya Sai baba's caregiver satyajit. He questioned that how Satyajit allowed to stay in ICU.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X