హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ అవినీతిపై పోరాడదామనే కండిషన్ పెట్టి మంత్రివర్గంలో చేరా: డిఎల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: అవినీతిలో కూరుకు పోయిన మాజీ పార్లమెటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పోరాటం చేస్తానని చెప్పాకే తాను మంత్రివర్గంలో చేరానని మంత్రి, కడప కాంగ్రెసు పార్లమెంటు అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి బుధవారం సిఎల్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. తాను ముఖ్యమంత్రి కావాలని ఏనాడు కోరుకోలేదని చెప్పారు. మంత్రి పదవిని కూడా తాను ఎప్పుడూ ఆశించలేదని చెప్పారు. రాజకీయాల్లోకి కాకతాళీయంగా మాత్రమే వచ్చానని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు సన్నిహితంగా ఉండాలని, అందరితో కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాను ఉన్నానని చెప్పారు. మధ్య తరగతి కుటుంబంలో నుండి వచ్చిన తాను కాంగ్రెసు పార్టీ ద్వారా శాసనసభ్యునిగా, మంత్రిగా ఎదిగానని అన్నారు. తనకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన కాంగ్రెసు పార్టీ కడప జిల్లాలో గడ్డు పరిస్థితి ఉందని అందరూ సృష్టించారని అలాంటి సమయంలో ఎంపీగా పోటీ చేయమని అధిష్టానం తనను ఆదేశించిందని చెప్పారు. పార్టీ అదేశించింది చేయడమే తన ఉద్దేశ్యం అన్నారు.

ఏప్రిల్ 9వ తేదికి ముందు కడపలో కాంగ్రెసు లేదని, మీడియా, మరికొందరు సృష్టించారన్నారు. గత ముప్పయ్యేళ్లుగా దివంగత వైయస్ కుటుంబం కడప రాజకీయాల్లో ఉండటంతో జగన్ విగ్రహాలు స్థాపించడానికి వచ్చినప్పుడు భారీగా కాంగ్రెసు కార్యకర్తలు రావడంతో ప్రజలు తన వెంటనే ఉన్నారని జగన్ భావిస్తున్నారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. వైయస్ మంచి పనులు చేశారు కాబట్టి ఆయనను పొగడటంలో తప్పు లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలోనే మా బలం తేలిపోయిందన్నారు. జగన్‌లా నేను ప్రచార రథంలో తిరగడం లేదన్నారు. పాదయాత్రలే చేస్తున్నానని అన్నారు. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెసు ఓటు బ్యాంకు భద్రంగా ఉందని, తన గెలుపు ఖాయమని చెప్పారు.

తాను రాజకీయాల్లోకి రావడానికి వైయస్ ప్రోత్సాహం కూడా ఉందని చెప్పారు. 2004లో తర్వాత కాంగ్రెసు పార్టీపై గౌరవం పెరిగిందన్నారు. జగన్‌ను గెలిపిస్తే అవినీతికి పట్టం కట్టడమే అని చెప్పారు. జగన్‌ను పార్టీ నుండి ఎవరూ బయటకు పంపించలేదని చెప్పారు. అధికార దాహంతో ఆయనే పార్టీలో ఇమడలేక బయటకు వెళ్లిపోయారని చెప్పారు. పార్టీ ప్రకారం వ్యక్తులు నడవాల్సి ఉంటుంది. అంతేకానీ వ్యక్తుల ఇష్టానుసారం పార్టీ నడవదు అని చెప్పారు. జగన్ ఇదివరకు ఎంపీగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదని ఇప్పుడు కూడా ఆయన చేసేదేమీ లేదని చెప్పారు. కడప బరిలో ఉన్న వారిలో జగన్ ముఖ్యమంత్రి పదవికోసం ఎదురు చూస్తున్నారు, మైసూరారెడ్డి ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు ఇక పార్లమెంటుకు పోవాలని కోరుకుంటుంది తాను ఒక్కడినేనని అందుకే ప్రజలు తనను గెలిపిస్తారని చెప్పారు.

English summary
Minister DL Ravindra Reddy confirmed today that he was joined in cabinet if party will fight on Ex MP YS Jagan's corruption. He said he will win compulsory in bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X