నాగం జనార్దన్ రెడ్డిపై మోత్కుపల్లి నరసింహులు మరోసారి ఫైర్

Mothkupally Narasimhulu
హైదరాబాద్: తమ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డిపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నరసింహులు మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణ సాధన కోసం తెలంగాణ యాత్ర చేపట్టాలనే నాగం జనార్దన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. నాగం జనార్దన్ రెడ్డి చేపట్టే పాదయాత్రకు తాము మద్దతు ఇవ్వబోమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే నాగం జనార్దన్ రెడ్డి ఏకాకిగా మిగిలిపోతారని ఆయన అన్నారు. నాగం జనార్దన్ రెడ్డి ఒంటెత్తు పోకడలు మంచివి కావని ఆయన అన్నారు. వ్యక్తిగత నిర్ణయాలకు తమ మద్దతు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ఫోరంలో ఉమ్మడిగా నిర్ణయం తీసుకునే కార్యక్రమాలకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. తమ పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కలిసికట్టుగానే ఉన్నారని, ఒకరిద్దరు విభేదిస్తే విభేదించవచ్చునని ఆయన అన్నారు. నాగం జనార్దన్ రెడ్డి పార్టీతో, తమతో ఎందుకు విభేదిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పార్టీని, పార్టీ నాయకులను పలుచన చేసేందుకు నాగం జనార్దన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+