వంద కోట్లు ఎలా పంచాలో తెలియక మంత్రులు తికమక: వైయస్ జగన్

తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం ప్రొద్దుటూరులో ముస్లిం మైనార్టీలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చలవ వల్లే దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. వైఎస్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని వైఎస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులు వందల కోట్లు పట్టుకుని తిరుగుతున్నారని, వాటిని ఎవరికి పంచాలో వారికి అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తాను అధికారంలోకి వస్తే ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications