సిగ్గు లేకుండా నాపై రోజుకో అభాండం వేస్తున్నారు: వైయస్ జగన్

YS Jagan
కడప: సిగ్గు లేకుండా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తనపై రోజుకో అభాండం వేస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప లోకసభ అభ్యర్థి వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం కొత్తపల్లి, తదితర గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కయి ఏం చేస్తాయో తనకు మాత్రం తెలియదు గానీ ప్రజలను మాత్రం మోసం చేస్తాయని ఆయన విమర్శించారు. మంత్రులు తనను, తన తల్లిని ఓడించడానికి డబ్బు సంచులు పట్టుకుని తిరుగుతున్నారని ఆయన అన్నారు.

మన ప్రభుత్వాన్ని మనమే తెచ్చుకుందామని, వైయస్ రాజశేఖర రెడ్డి స్వర్ణయుగాన్ని సాధించుకుందామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూమి లేని ప్రతి పేదవానికి భూమిని కేటాయిస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం కానంపల్లిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి పథకాలను అమలు చేస్తామన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా వ్యవసాయం సాగు చేసుకునేలా చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+