అమెరికాలో తెలుగు ఎన్నారై కాల్చివేత, మృతుడు పాలమూరు జిల్లావాసి

అర్జున్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మాదారం గ్రామానికి చెందినవారు. కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డికి ఆయన దూరపు బంధువని చెబుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి శాసనసభా నియోజకవర్గం టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఓ నెల రోజుల్లో ఆయన స్వస్థలానికి రావాల్సి ఉందని చెబుతున్నారు. నల్లజాతీయులే అర్జున్ రెడ్డిని కాల్చి చంపినట్లు అనుమానిస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications