మహిళల విషయంలో చిరు తమ్ముల బాగోతం ఉంది!: కొండా సురేఖ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి పేరు చెబితేనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు గుండెదడ వస్తుందని ఆమె అన్నారు. ఇక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని తెలియడంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధంకావడంలేదన్నారు. ఇవి కడపకు ఢిల్లీకి జరుగుతున్న ఎన్నికలని ఆమె అన్నారు. ఇక్కడ ఓటేస్తే ఢిల్లీలో గూబగుయ్యమనాలని ఆమె ఓటర్లకు పిలుపు ఇచ్చారు.
గత మూడు రోజులుగా వైఎస్సార్ జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత , టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. చంద్రబాబు తన అనుచరులతో కలిసి కొమ్మునూతల గ్రామస్థులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వానికి, చంద్రబాబుకు అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారని కరుణాకరరెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications