వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సముద్రంలో లాడెన్ సమాధి, ముస్లింల ప్రార్థనలను తప్పించడానికే

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
వాషింగ్టన్: డిఎన్ఎ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ మృతదేహాన్ని సముద్రంలో సమాధి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇస్లాం మత సంప్రదాయాల ప్రకారం లాడెన్‌ అంత్యక్రియలు జరిగినట్లు సమాచారం. భూమి మీద సమాధి చేస్తే అది ముస్లింల ప్రార్థనా మందిరంగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన అమెరికా పాలనా యంత్రాంగం దాన్ని తప్పించడానికి లాడెన్ మృతదేహాన్ని సముద్రంలో సమాధి చేసినట్లు చెబుతున్నారు. వచ్చే ప్రార్థనా సమయం లోపల మృతదేహాన్ని ముస్లింలు శుద్ధి చేసి సాధ్యమైనంత త్వరగా సమాధి చేయాల్సి ఉంటుంది.

అయితే, ఇంకా డిఎన్ఎ పరీక్షలు జరుగుతున్నాయని, లాడెన్ ముఖాన్ని గుర్తించడానికి అసరమైన పద్ధతులను అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. అధికారికంగా రెండు రోజుల తర్వాత అమెరికా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇస్లామ్ మత సంప్రదాయాల ప్రకారమే తాము నడుచుకుంటామని అమెరికా అధికారులు అంతకు ముందు చెప్పారు. అబ్బొత్తాబాద్‌లో అమెరికా బలగాలు జరిపిన దాడిలో లాడెన్‌తో పాటు ఆయన ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు మరణించినట్లు చెబుతున్నారు.

English summary
It seems that the sharks of the sea have been posed to a mere danger as several media reports on Monday, May 2 claimed that Bin Laden's body has been buried in a sea, maintaining the Islamic practice and tradition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X