వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్‌ ఎలా హతమయ్యాడు?, పాకిస్తాన్‌పై తీరని అనుమానాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
ఇస్లామాబాద్: ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను ఎలా మట్టుబెట్టారనే విషయాలపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. పాకిస్తాన్ మిలటర అకాడమీకి కేవలం వంద గజాల దూరంలో ఉన్న రెండంతస్థుల భవనంలో లాడెన్ తల దాచుకున్నట్లు గుర్తించారు. దాంతో అమెరికా ఉగ్రవాద నిరోధక బలగాలు సోమవారం ఉదయం ఆ భవనంపై దాడి చేసి లాడెన్‌ను హతమార్చాయి. సోమవారం తెల్లవారు జామును భవనం నుంచి మంటలు లేచాయి. అదే అమెరికా బలగాల దాడికి నిదర్శనమని అంటున్నారు.

గుహల్లో లాడెన్ చనిపోయాడని చెబుతున్నప్పటికీ పాకిస్తాన్ సైనిక స్థావరంగా ఉంటూ వస్తున్న పట్టణంలో మరణించినట్లు తెలుస్తోంది. అమెరికా దాడిలో లాడన్ కుమారులు కూడా మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, అమెరికా ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. పాకిస్తాన్‌లోని అబ్బొత్తాబ్ పట్టణంలోని భవనంపై నుంచి లాడెన్ సంరక్షకులు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో హెలికాప్టర్ కూలిపోయిందని చెబుతున్నారు. రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అంటున్నారు. దాడిలో హెలికాప్టర్లు, పదాతి దళాలు పాల్గొన్నట్లు చెబుతున్నారు.

అబ్బొత్తాబాద్‌లో పాకిస్తానీ సైన్యం రెజిమెంట్ ఉంటుంది. సైనిక భవనాలు, వేలాది మంది సైనికాధికారుల ఇళ్లు ఉంటాయి. ఉగ్రవాదులను ఏరివేశామని చెప్పిన పాకిస్తాన్ మాటలు ఏ మేరకు నిజమనేది లాడెన్ ఆశ్రయం పొందడాన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. ఇంతగా సైనిక పటాలం ఉన్న ప్రాంతంలోనే లాడెన్ తలదాచుకోవడం పాకిస్తాన్‌పై అనుమానాలకు తావిస్తోంది. పాకిస్తాన్ మాటలకు, చేతలకు పొంతన లేదనే విషయాన్ని ఆ సంఘటన తెలియజేస్తోందని అంటున్నారు.

English summary
Osama bin Laden was holed up in a two-story house 100 yards from a Pakistani military academy when four helicopters carrying US anti-terror forces swooped in the early morning hours of Monday and killed him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X