ఎఐఇఇఇ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఉత్తరప్రదేశ్‌లో ఒకరి అరెస్టు

AIEEE
లక్నో: ఆల్‌ ఇండియా ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఈఈఈ) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి ఫూల్‌చంద్ర అనే వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్న ఫూల్‌చంద్ర సోదరుడే ఈ లీకేజీకి పాల్పడిన ముఠా నాయకుడని ఎస్పీ విజయ్‌ ప్రకాష్‌ తెలిపారు. ప్రస్తుతం ఫూల్‌చంద్రను విచారిస్తున్నామన్న ఎస్పీ ఈ వ్యవహారం వెనుక ఉన్న వారందర్నీ త్వరలోనే పట్టుకుంటామన్నారు.

ఏఐఈఈఈ ప్రశ్న పత్రాలు ఉత్తరప్రదేశ్‌లో లీకవడం వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులు చాలా ఇబ్బందిపడ్డారు. ఆరు లక్షలకు ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో సీబీఎస్‌ఈ అప్పటికప్పుడు మరో కొత్త ప్రశ్నపత్రం తయారుచేసి పరీక్షను రెండు గంటలు ఆలస్యంగా నిర్వహించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+