లాడెన్‌పై దాడిని బరాక్ ఒబామా, ఆయన కంపెనీ ఎలా చూశారు?

తాము ఏ విధమైన దృశ్యాలను చూశాం, ఏ విధమైన సమాచారం తమకు లభించిందనే విషయాలను బయటపెట్టలేమని శ్వేతసౌధం ఉగ్రవాద నిరోధక సలహాదారు జాన్ బ్రెన్నన్ చెప్పారు. గోల్ఫ్ ఆడుతున్న ఒబామా దాన్ని వదిలేసి సిచ్యుయేషన్ రూంలోకి వచ్చారు. ఆపరేషన్‌లో పాల్గొన్న నేవీ సీల్ టీమ్ హెల్మెట్ కమెరాలను ధరించారని, అవి దృశ్యాలనూ శబ్దాలను ప్రసారం చేశాయని, దాంతో ఆపరేషన్‌ను ప్రత్యక్షంగా చూడగలిగారని చెబుతున్నారు.
సీల్స్ అబ్బొత్తాబాద్‌లోని లాడెన్ నివసిస్తున్న భవనంపై దిగినప్పటి నుంచి ఆపరేషన్ పూర్తయ్యే వరకు తమలో ఊపిరి సలపనంతగా ఉత్కంఠ నెలకొని ఉందని, నిమిషాలు రోజుల్లాగా గడిచాయని బ్రెన్నన్ చెప్పారు. ఏమైనా జరగవచ్చు, లాడెన్ కనిపిస్తాడా, లేదా అనేది కూడా అనుమానమేనని ఆయన అన్నారు. ఓ హెలికాప్టర్ దెబ్బ తిన్నదని, వెంటనే ప్రత్యామ్నాయం ఆలోచించి, మరో హెలికాప్టర్‌ను రంగంలోకి దించామని, అది ఫలితం ఇచ్చిందని, లాడెన్ హతమయ్యాడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications