వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్ అంతానికి అమెరికాకు 1.3 ట్రిలియన్ డాలర్లు, పదేళ్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి అమెరికాకు 1.3 ట్రిలియన్ డాలర్ల ఖర్చయింది. లాడెన్‌ను అంతం చేయడానికి పదేళ్లు పట్టింది. 2001 సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్‌పై దాడికి ప్రధాన కారకుడైన లాడెన్‌ను అమెరికా పదేళ్లుగా వేటాడుతూ వచ్చింది. దాడులకు ప్రధాన సూత్రధారి లాడెన్‌ అని అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్ ప్రకటించి ఉగ్రవాదంపై పోరును ప్రకటించారు. దాన్ని కొత్త అధ్యక్షుడు బరాక్ ఒబామా కొనసాగించారు. తొలుత లాడెన్ కోసం అఫ్ఘనిస్తాన్‌లో వేట ప్రారంభించారు. ఆ తర్వాత ఆఫ్రికా, పిలిప్పైన్స్ వంటి దేశాలకు విస్తరించింది. దాదాపు డజను దేశాలను ఇందులో భాగస్వాములను చేసింది. అయినా లాడెన్ ఆచూకీ దొరకలేదు.

లాడెన్ వేట కోసం ఖర్చు చేసిన 1.28 ట్రిలియన్ డాలర్లను కాంగ్రెసనల్ రీసెర్చ్ సర్వీస్ లెక్కలు కట్టింది. మిగతా 6 బిలియన్ డాలర్లకు లెక్క చెప్పలేకపోయింది. లాడెన్ కోసం వేటలో అమెరికా 6 వేల మందిని కోల్పోయింది. మరో 55 వేల మంది గాయపడ్డారు. వేలాది మందిగా పౌరులు మరణించారు. అమెరికాపై దాడి తర్వాత 13 భారీ ఉగ్రవాద దాడులు జరిగాయి. వాటిలో వేయి మంది మరణించారు. కనీసం పది ప్రణాళికాబద్దమైన దాడులను తిప్పికొట్టారు. ఎట్టకేలకు లాడెన్‌ను అమెరికా పాకిస్తాన్‌లోని అబ్బోతాబాద్‌లో హతమార్చింది.

English summary
The costliest and bloodiest manhunt in human history came to an end when Osama bin Laden was killed by US special forces in a nighttime shootout in Abbotabad, Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X