కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉపపోరులో వైయస్ జగన్, వివేకానందరెడ్డి మధ్య కరపత్రాల యుద్ధం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-YS Vivekananda Reddy
కడప: మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి, ఆయన సోదరుడి తనయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ప్రత్యక్ష ఆరోపణ, ప్రత్యారోపణలు చోటు చేసుకోకున్నప్పటికీ పరోక్షంగా మాత్రం ఒకరిపై మరొకరు తీవ్రంగా ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. అందుకు వారు కరపత్రాలను ఉపయోగించుకుంటున్నారు. కరపత్రాలను ముద్రించి ఓటర్లకు పంచి ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. వివేకానందరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఒకే కుటుంబ సభ్యులు కాబట్టి తమ తమ ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలకు ఏమాత్రం దిగడం లేదు. అయితే కరపత్రాల ద్వారా మాత్రం తమ ఉక్రోషాన్ని చూపిస్తున్నారు.

విశ్వసనీయతా, నీ రూపం ఇదేనా అనే పేరుతో వైయస్ వివేకానందరెడ్డి వర్గం కరపత్రాలు ముద్రించి వోటర్లకు పంచి పెట్టింది. పెంచి పెద్ద చేసిన కాంగ్రెసు పార్టీని వీడి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడానికి మళ్లీ ఎన్నికలు తేవడమే విశ్వసనీయతా అని అందులో ప్రశ్నించారు. జగన్‌కు ఓటేయకుండా బుద్ధి చెప్పాలి అనే కరపత్రాలను ముద్రించారు. దీనికి ప్రతిగా జగన్ వర్గం వైయస్ వివేకానందరెడ్డికి ఎందుకు ఓటు వేయవద్దు అనే కరపత్రాన్ని ముద్రించింది. వివేకానంద కాంగ్రెసులో ఉండి కుటుంబ గౌరవాన్ని మంట గలిపారని, మంత్రి పదవి కోసం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెసు బానిస అయ్యారన్నారు. వివేకా మంత్రి పదవి వల్లే ఎన్నికలు వచ్చాయని ఆరోపించారు. వివేకా కాంగ్రెసు పిచ్చిలో పడిపోయారన్నారు.

English summary
Pomphlet war is going on between Ex MP YS Vivekananda Reddy, Congress Pulivendula candidate YS Vivekananda Reddy. YS Jagan blamed Vivekananda Reddy in his pomphlet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X