హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ అల్లుడు అనిల్‌పై ఈసికి ఫిర్యాదు, పిఎస్ ఎదుట వివేకా బైఠాయింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: ప్రముఖ క్రిస్టియన్ మత సంస్థ ప్రచారకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బావ అయిన బ్రదర్ అనీల్ కుమార్‌పై కాంగ్రెసు పార్టీ నేతలు ఎన్నికల సంఘంలో బుధవారం ఫిర్యాదు చేశారు. దేవుడికే ఓటు వేయాలంటూ అనీల్ కుమార్ జగన్ తరఫున చర్చిలలో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులలో ప్రచారం చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ అనీల్ మాత్రం చర్చిలలో ప్రచారం చేయడంపై సీరియస్‌గా దృష్టి సారించాలని వారు ఈసిని కోరారు.

మైదుకూరులో కూడా మంత్రి, కడప కాంగ్రెసు పార్లమెంటు అభ్యర్థి అయిన డిఎల్ రవీంద్రారెడ్డికి ఓటు వేయవద్దని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. కాంగ్రెసు ప్రతిష్టను దిగజార్చేలా వారు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కాగా కాంగ్రెసు పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్టులకు నిరసనగా పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి వివేకానందరెడ్డి పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు. తమ కార్యకర్తలను అనవసరంగా అరెస్టుల పేరుతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.

English summary
Congress leaders complained against Brother Anil Kumar today to election commission for his campaign in churches. They said YSR Congress party leaders are creating threat in voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X