Tamil Nadu Exit Poll 2026: తమిళనాడులో గెలిచేది వాళ్లే-తేల్చేసిన ఎన్డీటీవీ..!

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తమిళనాడు (tamil nadu) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీ తన ఎగ్జిట్ పోల్ (exit poll 20226) ఫలితాలను విడుదల చేసింది. ఈ నెల 23న తమిళనాడులో ఒకే విడతలో జరిగిన ఎన్నికలు హోరాహోరీగా సాగినట్లు ఎన్టీటీవీ తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తెలిపింది. అలాగే ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని తేల్చేసింది.

తమిళ ప్రజలకు స్టాలిన్ గుడ్ న్యూస్..! ఫలితాలకు ముందే..!
తమిళ ప్రజలకు స్టాలిన్ గుడ్ న్యూస్..! ఫలితాలకు ముందే..!

తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమికి ఈసారి 125-145 సీట్లు లభిస్తాయని ఎన్టీటీవీ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అలాగే విపక్ష అన్నా డీఎంకే కూటమికి కేవలం 65-80 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు తేల్చింది. విజయ్ కొత్త పార్టీ టీవీకేకు 18-24 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఇతరులకు 2-6 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు ఎన్టీటీవీ ఎగ్జిట్ పోల్ తెలిపింది.

NDTV Exit Poll Reveals Predicted Winner of Tamil Nadu Assembly Election
Tamil Nadu Forecast: తమిళనాడు విజేత ఎవరు ? తేల్చేసిన సత్తా బజార్..!
Tamil Nadu Forecast: తమిళనాడు విజేత ఎవరు ? తేల్చేసిన సత్తా బజార్..!

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ లేదా కూటమికి అవసరమైన మ్యాజిక్ మార్కు సీట్లు 118. ఈ లెక్కన డీఎంకే కూటమి గతంతో పోలిస్తే సీట్ల సాధనలో వెనుకబడినా అధికారం చేపట్టడం ఖాయమని తేలిపోయింది. ఎన్నో ఆశలతో కొత్త పార్టీ పెట్టిన విజయ్ కు తొలిసారి ఎన్నికల్లో ఉనికి చాటు కునే స్ధాయిలో సీట్లు లభిస్తున్నా అధికారం చేపట్టడం కానీ, కింగ్ మేకర్ అయ్యే అవకాశం కానీ దక్కడం లేదని తేలిపోయింది. అలాగే బీజేపీ మద్దతు లభించినా అన్నాడీఎంకే ప్రదర్శన పేలవంగానే ఉందని ఎగ్జిట్ పోల్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+