Drishyam 3 టీజర్ రివ్యూ: ఈ క్లైమాక్స్ కు గూస్ బంప్స్ పక్కా..!!
థ్రిల్లర్ సినిమాలు అంటే మలయాళం సినిమాలే గుర్తుకొస్తాయి. అయితే మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్- మీనా జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 3 టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. దృశ్యం, దృశ్యం 2 సినిమాలకు మించిన ట్విస్టులు ఈ మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక క్లైమాక్స్ కు గూస్ బంప్స్ పక్కా అని స్పష్టం అవుతోంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం జీతూ జోసెఫ్ వహించారు. ఈ మూవీ మే 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో మోహన్ లాల్, మీనాతో పాటుగా ఎస్తేర్ అనీల్, అన్సీబా హాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఇక టీజర్ 1 నిమిషం 51 సెకన్లు ఉంది. దృశ్యం 2 సినిమాకు కొనసాగింపుగానే ఈ మూవీ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. దృశ్యం సినిమాకు మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు యావత్ భారత్ లోని సినీ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. తొలి రెండు పార్ట్ లు ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన విషయం తెలిసిందే. దాంతో దృశ్యం 3 పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని తెగ ఎదురుచూస్తున్నారు. అయితే నిజానికి ఈ మూవీ ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉంది. అయితే గల్ఫ్ దేశాల్లో నెలకున్న ఉద్రిక్తతల కారణంగా ఈ సినిమాను మే 21 కు వాయిదా వేశారు.

అయితే గతంలో మాదిరిగానే దృశ్యం 3 చిత్రాన్ని అన్ని భాషల్లో కాకుండా ఈసారి కేవలం మలయాళంలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మరి తెలుగులో ఇప్పటికే రెండు పార్ట్ ల్లో వెంకటేశ్ నటించిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో అజయ్ దేవ్ గన్ నటించాడు. మరి వీరి నుంచి రీమేక్ వర్షన్స్ ఎప్పుడు వస్తాయన్నది దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం వెంకటేశ్ త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నాడు. అలాగే అనిల్ రావిపూడితో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో దృశ్యం 3 రీమేక్ ఇప్పట్లో లేనట్లే అనిపిస్తోంది.












Click it and Unblock the Notifications