హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం పదవి కోసం పాకులాడింది జగన్ కాదు, కిరణ్: అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీని వీడింది ముఖ్యమంత్రి పదవి ఆశించి కాదని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేత అంబటి రాంబాబు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. జగన్ సిఎం పదవి కోసమే పార్టీ నుండి బయటకు వెళ్లారని వస్తున్న వాదనలలో ఎలాంటి నిజాలు లేవన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే సిఎం పదవి కోసం పాకులాడారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై అధిష్టానానికి తప్పుడు నివేదికలు పంపి తాను సిఎం కావడానికి అనుకూలత ఏర్పరుచుకున్నారని ఆరోపించారు.

కడప, పులివెందుల ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు పార్టీలు కలిసి జగన్, విజయమ్మలను ఓడించడానికి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడానికి ఆ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

English summary
YSR congress party senior leader Ambati Rambabu condemned CM Kiran Kumar Reddy comments that the Ex MP YS Jagan was leave Congress party for CM post. He accused that Kiran was sent wrong reports on ex CM Rosaiah to high command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X