రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుక్క కాటుకు అనూష మృతి, చేతులెత్తేసిన రాజమండ్రి వైద్యులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajahmundry
రాజమండ్రి: రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీకి చెందిన పి.అనూష కుక్క కాటుకు వైద్యం అందక మరణించింది. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విచారణకు ఆదేశించారు. అనూష (10) ఐదో తరగతి చదువుతోంది. తండ్రి ప్రకాశం జిల్లా దర్శిలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. తల్లి మాత్రమే ఇక్కడ ఉంటుంది. నెల రోజుల క్రితం ఇంటిముందు ఆడుకుంటున్న అనూషను వీధి కుక్క కరిచింది. తల్లి వెంటనే ఆమెను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ, తమ వద్ద యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్‌వీ) లేదంటూ వైద్యులు చేతులెత్తేశారు. అనూషను తిప్పి పంపారు.

ఆమె తల్లి అనూషకు స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీతో వైద్యం చేయించింది. ఆ డాక్టరు కూడా టీటీ ఇంజక్షన్ ఇచ్చి వదిలేశాడు. కుక్కకాటుకు ఈ వైద్యం సరిపోదని, ఏఆర్‌వీ వేయించాలని ఆ తల్లికి తెలియదు. మంగళవారం అనూష ఆరోగ్య పరిస్థితిలో బాగా మార్పు కనిపించింది. కూతురిని రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడి సిబ్బంది ఒక సూది వేసి పాపను బెడ్ మీద పడుకోబెట్టారు.

అనూష ఆస్పత్రిలో నురగలు కక్కుతూ కేకలు వేసింది. ఒక్క డాక్టరూ రాలేదు. నర్సూ రాలేదు. ఆస్పత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.దాదాపు రెండు గంటలు గడిచిపోయాయి. నురగలు కక్కుతూ, కేకలు వేస్తూ అనూష ప్రాణాలు విడిచింది. గతంలో కూడా కొంత మంది కుక్క కాటుకు రాజమండ్రిలో బలయ్యారు. అనూష మృతిపై మావన హక్కుల కమీషన్ తీవ్రంగా ప్రతిస్పందించారు. వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

English summary
Ten years old girl Anusha dead with rabies at Rajahmundry. She was bitten by a dog. Hospital authorities said that they are not having rabies vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X