కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరిగి కాంగ్రెసులోకి వెళ్లేది లేదు, సోనియాకు దిమ్మ తిరగాలి: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ఉప ఎన్నికలు విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షలను వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు. అధికారం కోసమో, పదవుల కోసమో విలువలను తాకట్టు పెట్టలేనని స్పష్టం చేశారు.

ఓదార్పు యాత్రకు అడ్డుపడిన కాంగ్రెస్ తనను పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేసిందని వైఎస్ జగన్ అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకో లేకపోతే తనకు వ్యక్తిత్వమేముందని ఆయన ప్రశ్నించారు. కడపలో జరిగే ఉప ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలను మార్చివేసేందుకు నాంది పలుకుతాయన్నారు. వైఎస్ఆర్ ను ఆదరించే ప్రజలను ప్రలోభాల ద్వారా మోసగించలేరన్నారు. అయితే కుటుంబంలో ఏర్పడ్డ చీలికే తనను బాధిస్తోందన్నారు. అయినా అధిష్టానం కుట్రను ప్రజలను అర్ధం చేసుకున్నారని జగన్ అన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప నగరంలో గురువారం రోడ్‌షో నిర్వహించారు. ఓటర్లను డబ్బుతో కొనలేదరని అన్నారు. కాంగ్రెస్ డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన జగన్ మరోసారి స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి దిమ్మ తిరిగేలా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఆయన కోరారు.

English summary
YSR Congress party leader YS Jagan clarified that he will rejoin in Congress. He said that family split is aweful.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X