• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీ సత్య సాయి సెంట్రల్ టస్టుకు చైర్మన్ సత్య సాయి బాబానే

By Pratap
|

Sathya Sai Baba
పుట్టవర్తి: సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు శాశ్వత ఛైర్మన్‌గా బాబానే కొనసాగుతారని, ఆ స్థానాన్ని భర్తీ చేయటం ఎవరివల్లా కాదని,ట్రస్టు వ్యవస్థాపకుడు ఆయనే కాబట్టి ఛైర్మన్‌గా కూడా ఆయనే కొనసాగుతారని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు సభ్యుడు వి.శ్రీనివాసన్‌ స్పష్టం చేశారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో బుధవారం రాత్రి సత్యసాయి బాబా సంస్మరణ కార్యక్రమం జరిగింది. ట్రస్టు కార్యకలాపాలపై కొన్ని దుష్టశక్తులు బురదజల్లుతున్నాయని, వాటికి భక్తులు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. బాబా తలపెట్టిన ఏ కార్యక్రమాన్ని ఆపేది లేదని, ఉచిత విద్య, వైద్యం, తాగునీటి పథకాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. ట్రస్టు చేపట్టే ప్రతి కార్యక్రమ వివరాలను ఏటా వార్షిక నివేదికల రూపంలో ముద్రించి పబ్లిక్‌ డాక్యుమెంట్‌గా ఉంచుతామని స్పష్టం చేశారు.

సత్యసాయి ఇంటర్నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ఈ నెలలో బుద్ధపౌర్ణమిని పురస్కరించుకుని రెండ్రోజుల పాటు పుట్టపర్తిలోని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రపంచ ఆర్థోపెడిక్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రొఫెసర్‌ అనిల్‌కుమార్‌, సత్యసాయి కళాశాల పూర్వ విద్యార్థి సంజయ్‌సహాని తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి చక్రవర్తి, సభ్యులు శ్రీనివాసన్‌, ఎస్‌.వి.గిరి, భగవతి, ఇందూలాల్‌షా, జె.వి.శెట్టితో పాటు దేశ, విదేశాలకు చెందిన సత్యసాయి భజనమండలి సభ్యులు, సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.

బాబా ఆరాధనోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాబా దేహాన్ని వీడి పది రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మహాసమాధి ఏర్పాటు చేసిన సాయికుల్వంత్‌ హాల్లో ఉదయం 6.30 నుంచి 10.30 గంటల వరకు బాబా కుటుంబ సభ్యులు, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాజమండ్రికి చెందిన కందుకూరి కొండావధాని శాస్త్రి నేతృత్వంలో 13 మంది వేదపండితులు, రుత్వికులు నారాయణ బలిహోమంతో పాటు పలు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 6.30 గంటలకు విఘ్నేశ్వర పూజతో ఆరాధనోత్సవం ప్రారంభమైంది.

పుణ్యావచనం, పురుషసూక్త సహిత పారాయణం, మండపారాధన, నారాయణ బలిహోమం, తీర్థరాజ పూజలు నిర్వహించారు. వైకుంఠలోక ప్రాప్తం కోసం పూజలు, హోమాలు చేసినట్లు కొండావధాని శాస్త్రి తెలిపారు. బాబా సోదరుడి కుమారుడు రత్నాకర్‌ మహాసమాధి వద్ద తీర్థరాజ పూజలు చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఆరాధనోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేద పఠనంతో కుల్వంత్‌ హాలు మారుమోగింది.

English summary
Sri Sathya Sai Central Trust member Srinivasan said that there will be no chairman for trust. He said that Sathya Sai baba will continue as the chairman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X