2జి కెసులో సిబిఐ కోర్టులో కనిమొళి హాజరు, అరెస్టుకు రంగం సిద్ధం!

కనిమొళికి డీఎంకే పూర్తి మద్దతు ఇస్తోంది. కనిమొళి కన్నా ముందే టిఆర్ బాలు, తిరుచ్చి శివ, ఇళంగోవన్ లాంటి నేతలంతా పాటియాలా హౌస్ న్యాయస్థానం ముందు వేచి ఉన్నారు. కనిమొళి తల్లి కూడా ఢిల్లీ వచ్చారు. రాం జెఠ్మలానీ ఆమె తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసు స్ట్రాంగ్ గా ఉన్నందున కనిమొళి బయట పడే అవకాశాలు కనిపించడం లేదు. అలా అయితే ఆమె ఇప్పటికే 2జి కేసులో అరెస్టు అయి తీహార్ జైలులో ఉన్న రాజా ఉన్న జైలుకే పంపే అవకాశాలు ఉన్నాయి. అయితే డిఎంకే కేంద్ర ప్రభుత్వంపై ఈ కేసు విషయంలో ఒత్తిడి తెస్తున్నప్పటికీ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఎలాంటి అవకవతకలకు పాల్పడే అవకాశం లేకుండా పోయింది. దీంతో కనిమొళిని రిమాండ్‌కు పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పలువురు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications