వైయస్ జగన్‌పై చంద్రబాబు అవినీతి ఆరోపణలు పని చేయలేదా?

ఓ తల్లిని, బిడ్డను ఒంటరి చేసి దాడి చేస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యనే ప్రజల్లోకి లోతుగా వెళ్లిందని భావిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న ఆదరాభిమానాల ముందు, ఆయన మృతి వల్ల పెల్లుబుకిన సానుభూతి ముందు చంద్రబాబు ఆరోపణలు పని చేయలేదని అంటున్నారు. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంవి మైసురా రెడ్డి కనీసం రెండో స్థానంలోనైనా నిలుస్తారా అనేది సందేహంగానే ఉందని అంటున్నారు. కాంగ్రెసు ఓట్లన్నీ జగన్‌కు పడి, తెలుగుదేశం ఓట్లు చెక్కు చెదరకుండా మైసురా రెడ్డికి పడితే రెండో స్థానం వచ్చినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.
కాగా, పులివెందులలో వైయస్సార్ సతీమణి వైయస్ విజయమ్మ, వైయస్సార్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి మధ్య మాత్రమే ఓట్లు చీలుతాయని, తెలుగుదేశం అభ్యర్థి బిటెక్ రవికి ఓట్లు ఏ మాత్రం పడతాయనేది కూడా అనుమానమేనని చెబుతున్నారు. పైగా, బిటెక్ రవి పులివెందులకు సంబంధించి బలమైన అభ్యర్థి కూడా కారని అంటున్నారు.












Click it and Unblock the Notifications