దావూద్ తనయుడి పెళ్లి వేదిక మార్పు, పాక్ ఐఎస్ఐ ముందు చూపు
International
oi-Pratapreddy
By Pratap
|
పాకిస్తాన్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తనయుడి వివాహ వేదిక పాకిస్తాన్ నుంచి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీన దావూద్ కుమారుడు మొయిన్ పెళ్లి కావాల్సి ఉంది. పెళ్లి వేదికను మార్చాలని పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్‌కు సూచించినట్లు సమాచారం. ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా తమ దేశంలోనే మట్టుబెట్టిన నేపథ్యంలో ఐఎస్ఐ ముందు జాగ్రత్తగా దావూద్‌కు ఆ సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.
1993 ముంబై ఉగ్రవాద దాడుల కేసులో నిందితుడైన దావూద్ మే 1వ తేదీననే పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి సౌదీ అరేబియాకు పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. అతనితో పాటు అతని ముఖ్య అనుచరుడు ఛోటా షకీల్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తన తనయుడి వివాహ వేదికను పాకిస్తాన్ నుంచి దుబాయ్‌కి మార్చనున్నట్లు చెబుతున్నారు.
Days after reports claimed that Dawood Ibrahim Kaskar has fled Karachi, intelligence officials say Pakistan's ISI has advised India's most wanted criminal to shift the venue of his son Moin's May 28 wedding.
Story first published: Monday, May 9, 2011, 10:31 [IST]