కిరణ్ కుమార్ రెడ్డికి కడప చిచ్చు, మంత్రుల్లో పెరుగుతున్న అసంతృప్తి

Kiran Kumar Reddy
హైదరాబాద్: కడప చిచ్చు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెడకు చుట్టునేట్లుందనే వార్తలు వస్తున్నాయి. కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్, పులివెందుల శాసనసభా స్థానంలో వైయస్ విజయమ్మ భారీ మెజారిటీతో గెలుస్తారని కాంగ్రెసు నాయకులే అంగీకరిస్తున్నారు. ఈ స్థితిలో మంత్రివర్గంలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అసమ్మతి సెగలు ఎగిసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే ముఖ్యమంత్రిపై వ్యంగ్యాస్త్రం విసిరారు. ముఖ్యమంత్రిపై తిరుగుబాటుకు రంగం సిద్ధమవుతున్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక రాసింది. కడప ఉప ఎన్నికల్లో ముందుండి పార్టీని నడిపించడంలో కిరణ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కడప ఉప ఎన్నికలపై ముందస్తు వ్యూహరచనలో కిరణ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని, దాంతో రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు. పైగా, కడప ఉప ఎన్నికల ప్రచారానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ దూరంగా ఉండి, బాధ్యత ముఖ్యమంత్రిదే అన్నట్లు వ్యవహరించారు. తన వైఫల్యాలను కిరణ్ కుమార్ రెడ్డి ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అసమ్మతివాదులు అంటున్నారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పుడుతున్నవారిపై చర్యలు తీసుకోకపోవడం కూడా నష్టానికి కారణమని అంటున్నారు. ఉప ఎన్నికలు జరుగుతాయని తెలిసినా కడప జిల్లాలో పునాది స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసే పనికి కిరణ్ కుమార్ రెడ్డి పూనుకోలేదని అంటున్నారు. కింది స్థాయిలో కీలక నేతలే కరువయ్యారు. జిల్లాలో పరిస్థితిపై డి. శ్రీనివాస్‌తో చర్చించి తగిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. మొత్తం మీద, ఉప ఎన్నికల తర్వాత మార్పు సంభవిస్తుందన్న జగన్ మాట నిజమవుతుందేమోననే వ్యాఖ్య కూడా వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+