మళ్లీ జగన్ ఓదార్పు యాత్ర, విజయనగరం జిల్లాలో ఈ నెల 14 నుంచి

YS Jagan
విశాఖపట్నం: కడప, పులివెందుల ఉప ఎన్నికలు పూర్తి కావడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ మళ్లీ ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 13వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఆ మర్నాటి నుంచి ఆయన ఓదార్పు యాత్రను ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లా ఓదార్పు యాత్రను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 14వ తేదీన తిరిగి ప్రారంభించనున్నారని పార్టీ నాయకులు పి.సాంబశివరాజు, భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. కడప ఉప ఎన్నికల కారణంగా మధ్యలో నిలిపివేసిన ఈ జిల్లా యాత్ర 14 నుంచి 22వ తేదీ వరకూ జరుగుతుందని చెప్పారు. 14వ తేదీ సాయంత్రం కొమరాడలో రెండో విడత ఓదార్పు యాత్ర ప్రారంభమవుతుందన్నారు. విజయనగరంలో 22వ తేదీన జరిగే సభతో యాత్ర ముగుస్తుందని వివరించారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించిన తరువాత తొలియాత్ర విజయనగరంలోనే ప్రారంభమైందని, కడప ఉప ఎన్నికల కారణంగా మార్చి 30న వాయిదా పడిందని గుర్తుచేశారు.ఉప ఎన్నికల ఫలితం ప్రభావం అధికార పార్టీపై వుంటుందని, రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలకు ఇది బీజం వేయనున్నదన్నారు. తెలంగాణ జిల్లాల్లో కూడా ఓదార్పు యాత్ర జరుగుతుందని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు పెద్దింటి జగన్మోహనరావు, కె.శ్రీనివాసరాజు, వాకాడ నాగేశ్వరరావు, అవనాపు సూరిబాబు, డాక్టర్ కాశీనాయుడు, కె.శివున్నాయుడు, డి.సత్యనారాయణ, వాసిరెడ్డి తిలక్ కిరణ్, డాక్టర్ పెద్దినాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+