నాగం జనార్దన్ రెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకోదు: రేవూరి ప్రకాశ రెడ్డి

నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ సభ నిర్వహించడం సమర్థనీయమేనని ఆయన అన్నారు. తాము కూడా నాగం జనార్దన్ రెడ్డి మాదిరిగా ప్రత్యేక తెలంగాణ సభలు నిర్వహిస్తామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. నాగర్ కర్నూలు సభకు రావాలని నాగం జనార్దన్ రెడ్డి ఫోన్ చేసి తమకు చెప్పినట్లు ఆయన తెలిపారు. నాగం జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోందని వస్తున్న వార్తల నేపథ్యంలో రేవూరి ప్రకాశ రెడ్డి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications