వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాటసానిని క్షమించిన చిరంజీవి, చర్యలుండవని చెప్పిన వంగా గీత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తనపై ప్రజారాజ్యం పార్టీ చేసిన పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పిఆర్పీ శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి మంగళవారం ఆ పార్టీ అధినేత చిరంజీవిని విజ్ఞప్తి చేశారు. అందుకు చిరంజీవి అంగీకరించారు. మంగళవారం ఆయన డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాల తాఖీదుపై వివరణ ఇచ్చుకున్నారు. తాను ఎప్పుడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని కాటసాని చెప్పారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పని చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఆయన చిరంజీవిని కోరారు.

కాటసాని సమాధానానికి సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజారాజ్యం పార్టీ విప్ వంగా గీత ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లుగా చెప్పారు. కాటసాని సమాధానంతో తాము సంతృప్తి చెందామన్నారు. కాటసానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నాదెండ్ల మనోహర్‌ను కోరినట్లు ఆమె చెప్పారు. స్పీకర్ సానుకూలంగానే స్పందిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
PRP MLA Katasani Rami Reddy urged president Chiranjeevi that to withdraw complaint against him. He answered to deputy speaker Nadendla Manohar's notice today. PRP satisfied with his answer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X