కడపలో ఆగని చిచ్చు: కాంగ్రెసు కార్యకర్తలను చితకబాదిన జగన్ వర్గం

పోలీసులు కలుగ జేసుకొని ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. మరో గ్రామం మాగన్నగారిపల్లెలో కూడా కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు చెందిన చినీ తోటలను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను ఆర్థికంగా దెబ్బతీసేందుకే వారు తోటలను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తోటలు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరుడికి సంబంధించిన తోటలు అని తెలుస్తోంది. దీంతో కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు వెళ్లి జగన్ వర్గం నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications