వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌తో జూనియర్ ఎన్టీఆర్ చెలిమి, టార్గెట్లపై సర్దుబాట్లు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతూనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వివాహంలో వీరిద్దరు ఎడమొహం, పెడమొహంగానే వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రణాళికను హరికృష్ణ రచించి అమలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2014 శానససభ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించకుండా చూడడమే ప్రధాన ధ్యేయంగా హరికృష్ణ పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా దీర్ఘకాలిక వ్యూహాన్ని హరికృష్ణ తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు తరుచుగా ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వైయస్ జగన్ లక్ష్యం గానీ జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగానీ ముఖ్యమంత్రి పదవిని సాధించడమనేది అందరికీ తెలిసిందే. అయితే, ఇక్కడు జూనియర్ ఎన్టీఆర్ కాస్తా సర్దుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా చంద్రబాబును అడ్డుకోగలిగితే తెలుగుదేశం పార్టీ మరింత బలహీనపడుతుందని, అప్పుడు పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవడం సులభం అవుతుందని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారని సమాచారం. 2014 ఎన్నికల్లో వైయస్ జగన్‌కు అధికారం లభించేలా సహాయపడడం ద్వారా తన లక్ష్యానికి దగ్గర కావాలనేది జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశమని చెబుతున్నారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. వయస్సు కూడా చిన్నదే. ఇప్పుడు ఆయన వయస్సు 33 ఏళ్లు. అధికారం కోసం 2014 తర్వాత మరో ఐదేళ్లు ఆగాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. 2014 ఎన్నికలను వైయస్ జగన్ టార్గెట్ చేసుకుంటే తాను 2019 ఎన్నికలను టార్గెట్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో వైయస్ జగన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య చెలిమి సాధ్యమేనని అంటున్నారు. జగన్‌కు ఓ సామాజిక వర్గం మద్దతు బలంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వల్ల మరో బలమైన సామాజిక వర్గం మద్దతు లభించే అవకాశాలున్నాయి. ముందస్తు ఆలోచనతో ఇద్దరు యువనేతలు ఒక్కటైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

English summary
It is learnt that YSR Congress party leader YS Jagan is in touch with Tollywood hero Jr NTR to make understanding for the political future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X