ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి, పార్టీల జాతకాలు తేలేది రేపే

పశ్చిమ బెంగాల్‌లో అధికార వామపక్ష కూటమి అధికారాన్ని కోల్పోయే పరిస్థితి ఉందని అంచనాలు సాగుతున్నాయి. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీల కూటమి అధికారాన్ని చేపట్టడానికి అవసమైన మెజారిటీ సాధిస్తుందని చెబుతున్నారు. ఈ కూటమికి 210 నుంచి 220 సీట్ల వరకు రావచ్చునని చెబుతున్నారు. తమిళనాడులో అధికార డిఎంకె పార్టీ కాస్తా ఆధిక్యత సాధించవచ్చునని అంచనా వేస్తున్నారు. అతి స్వల్ప మెజారిటీతో డిఎంకె కూటమి గట్టెక్కే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే, అధికారం తనదేనని అన్నాడియంకె నేత జయలలిత దీమా వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలో హంగ్ రావచ్చుననే అంచనాలు సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications