ఉప ఎన్నికలు: వైయస్ జగన్, వైయస్ విజయమ్మ మెజారిటీపైనే ఆసక్తి

కాగా, వైయస్ జగన్ భారీ మెజారిటీతో గెలుస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులే కాకుండా కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా అంటున్నారు. వైయస్ జగన్ నాలుగు లక్షల మెజారిటీతో గెలుస్తారని లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. రేపు ఉదయం రెండు స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రేపు శుక్రవారం మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెల్లడవుతాయి. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వైయస్ జగన్ మెజారిటీ తగ్గించడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని అంటున్నారు. కడప లోకసభ స్థానంలోని బెల్లంమండిలో గురువారం రీపోలింగ్ జరిగింది. ఈ రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది.












Click it and Unblock the Notifications