రాజమండ్రి లోకసభ సీటుపై సినీ నటి, ఎంపి జయప్రద కన్ను

రాజమండ్రి సీటు నుంచి పోటీ చేసే విషయంపై మూడేళ్ల తర్వాత ఆలోచిస్తానని ఆమె చెప్పారు. అయితే, వచ్చే ఎన్నికల్లో మాత్రం రాష్ట్రం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఆమె కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీన్ని బట్టి ఆమె కాంగ్రెసు పార్టీలో చేరుతారని కచ్చితంగా చెప్పలేం. రాజమండ్రి సీటుకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కాదని మరొకరికి కాంగ్రెసు ఆ సీటును కేటాయించడం అంత సులభం కాదు.
జయప్రద వైయస్ జగన్ పార్టీలో చేరుతారని ఆ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాయపూర్ నుంచి పార్లమెంటుకు ఎన్నికవుతూ వచ్చారు. కానీ, సమాజ్‌వాదీ పార్టీకి దూరం కావడంతో రాష్ట్ర రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications