జగన్, బాబు, కిరణ్‌లను తెలంగాణలో అడుగు పెట్టనివ్వం: కెసిఆర్

పార్టీ కార్యవర్గ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ఖరారు చేశారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణపై దృష్టి సారించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యాచరణను రూపొందించారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూనుకోవాలని పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14వ తేదీన రాస్తారోకోలు నిర్వహించనున్నారు. 19వ తేదీన మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపడుతారు. ఈ నెల 25వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిస్తారు. ఈ నెల 30వ తేదీన రైలు రోకో కార్యక్రమాలు నిర్వహించాలని తెరాస నిర్ణయించింది.












Click it and Unblock the Notifications