జగన్‌తో వెళ్లడానికి నలుగురు పునరాలోచనలో పడ్డారు: మల్లు భట్టి

Mallu Bhatti Vikramarka
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కడప, పులివెందుల ఉప ఎన్నికలలో గెలిచినంత మాత్రన కాంగ్రెసు పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని కాంగ్రెసు చీప్ విప్ మల్లు భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. జగన్ వెంట కాంగ్రెసు శాసనసభ్యులు ఎవరూ వెళ్లరన్నారు. ప్రస్తుతం జగన్‌తో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు కూడా పునరాలోచనలో పడ్డారని చెప్పారు. ఉప ఎన్నికల తర్వాత ఏదో జరుగుతుందని జగన్ చెబుతున్నారని కానీ జరిగేది ఏమీ ఉండదన్నారు.

జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వారి సమాధానాలను బట్టి చర్యలు ఉంటాయని చెప్పారు. వారి సమాధానాలు ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ పరిశీలించాక చర్యలు ఉంటాయన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అరెస్టును ఆయన ఖండించారు. రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విరుద్దం అన్నారు. మాయావతి చర్యలు సరికాదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+