గ్రేటర్ నోయిడాలో రాహుల్ గాంధీ అరెస్టు, అర్థరాత్రి హైడ్రామా

రాహుల్ గాంధీ బుధవారం దాదాపు 19 గంటల పాటు భట్టా పరసోల్ గ్రామంలోని రైతులతో గడిపారు. గురువారం తెల్లవారు జామున 2 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు రాహుల్ గాంధీని బెయిల్‌పై విడుదల చేశారు. రాహుల్‌తో పాటు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సిగ్, ఉత్తరప్రదేశ్ కాంగర్ెసు చీఫ్ రీటా బహుగుణ జోషీ, కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు రాజ్ బబ్బర్, పర్వేజ్ హష్మీలను కూడా అరెస్టు చేశారు.
రాజకీయ నాయకులు గ్రామంలోకి ప్రవేశించకుండా మాయావతి ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ బుధవారం రాహుల్ గాంధీ బైక్‌పై భట్ట పరసోల్ గ్రామానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications