ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు హరికృష్ణ, నాగం: సమావేశానికి హాజరు

ఇక నాగం జనార్ధన్ రెడ్డి కూడా గత కొన్నాళ్లుగా పార్టీలో ఉంటూనే కాలికి ముల్లులా తయారయ్యాడు. తెలంగాణకు అనుకూలంగా పార్టీలు నిర్ణయం తీసుకోకుంటే మనుగడ సాగించలేవని టిడిపిలో ఉంటూనే విమర్శలు చేశారు. అధినేత చంద్రబాబుపై కూడా పరోక్షంగా ఘాటుగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నాగం, హరికృష్ణలు పార్టీ సమావేశానికి రారని అందరూ భావించారు. కానీ వారిద్దరూ సమావేశాలకు రావడం అందరికీ విస్మయం కలిగించింది. అయితే సమావేశంలో, తర్వాత వారు ఏమి మాట్లాడుతారో అనే దానిపై ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఉన్నారు.












Click it and Unblock the Notifications