పోర్టు విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ: దెబ్బకు పారిపోయిన అధికారులు

గంగవరం పోర్టులో అదనపు బెర్తులు నిర్మించకూడదని వారు డిమాండ్ చేశారు. అదనపు బెర్తులతో మత్స్యకారులతు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. మత్స్యకారులపై ఇంతకుముందు పెట్టిన కేసులు ఎత్తివేయాలని, మత్స్యకార్మికులకు ఉపాధి కల్పించాలని, మహిళలకు జీవనభృతి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నీ తీర్చాకే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. పరిసర ప్రాంతాలలో కాలుష్యం, నిర్వాసితులకు ఉపాధి తదితర విషయాలపై చర్చించిన తర్వాతే విస్తరణపై ఆలోచించాలని డిమాండ్ చేశారు. కాగా ఆందోళన చేస్తున్న సుమారు రెండు వందల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications