గిట్టుబాటుపై అధికార కాంగ్రెసు మొద్దు నిద్ర: టిడిపి నేత ఎర్రన్నాయుడు

గిట్టుబాటు ధర లేక రైతులు ధాన్యాన్ని రోడ్లపై పోసి తగలబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఇన్ పుట్ సబ్సిడి విడుదల కాలేదన్నారు. ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ నివేదికను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. స్వామినాథన్ నివేకదిక అమలు చేయకుండా ఇంకా ఎన్నాళ్లు రైతులను మోసం చేస్తారని ప్రశ్నించారు. రైతులకు కేంద్రం ప్రతిపాదించిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులను పరామర్శించడానికి గురువారం నుండు మూడు రోజుల పాటు చంద్రబాబు జిల్లాల్లో పర్యటిస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications