నాశనమైన బెంగాల్ ప్రజల్లో సంతోషాన్ని నింపుతా: మమతా బెనర్జీ

Mamata Benarjee
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ముప్పై అయిదేళ్ల కమ్యూనిస్టు పాలనకు తెర దించుతూ పశ్చిమ బెంగాల్ ఓటర్లు మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెసుకు పట్టం గట్టారు. టిఎంసి గెలుపు ఖాయమైన సందర్భంగా మమతా బెనర్జీ అభిమానులను, కార్యకర్తలను ఉద్దేశించి తన ఇంటి వద్ద నుండి మాట్లాడారు. ఇది ప్రజా విజయం అని అన్నారు. టిఎంసిని గెలిపించిన బెంగాల్ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం సాధించినందుకు గానూ మూడు దశాబ్దాలుగా పోరాటంలో అసువులు బాసిన త్యాగధనులను స్మరించుకుందామని చెప్పారు. టిఎంసి ఆధికారం చేపడుతున్న నేపథ్యంలో ఇక నుండి ప్రజాస్వామ్య విధానాలను బెంగాల్ ప్రజలకు తెలియనిద్దాం అని పిలుపు నిచ్చారు.

లెఫ్ట్ పాలనలో బెంగాల్ నాశనమైందని ఆరోపించారు. నాశనమైన బెంగాల్‌ను పునర్నిర్మిస్తానని చెప్పారు. ఇక నుండి బెంగాల్ ప్రజల్లో సంతోషాన్ని నింపుతానని చెప్పారు. కాగా టిఎంసి అధికారం చేపడుతుందన్న ఆనందం మమత ఇంటిముందు కనిపిస్తోంది. భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరి కోలహలంగా కనిపిస్తోంది. మమతా బెనర్జీ బెంగాల్‌లో పార్టీని గెలిపించి చరిత్ర సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+