నందమూరి ఫ్యామిలీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు చురక

రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు సోనియా గాంధీ ప్రధాని కాలేదని, పివి నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యారని ఆయన అన్నారు. ఎంజి రామచంద్రన్ మరణించగానే జయలలిత అధికారం చేపట్టలేదని, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విషయంలోనూ అలాగే జరిగిందని ఆయన ఉదహరించారు. నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన ఆ వివరణ ఇచ్చారు.
రాజకీయాల్లో వంశపారంపర్యత పనికి రాదని ఆయన అన్నారు. నాయకుడిని ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీలో ప్రతి నాయకుడికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నానని ఆయన చెప్పారు. పార్టీకి నష్టం కలిగించే పనులను దిగితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications