మళ్లీ మొదటికొచ్చిన కర్ణాటక కథ, యెడ్యూరప్పకు కష్టాలు

BS Yeddyurappa-HR Bhardwaj
న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయం మళ్లీ మొదటికొచ్చింది. అసమ్మతి శాసనసభ్యులపై స్పీకర్ అసమ్మతి వేటును సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ముఖ్యమంత్రి యెడ్యూరప్పకు మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ తన కత్తులకు పదును పెడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బలపరీక్షకు సిద్ధం కావాలని భరద్వాజ్ ముఖ్యమంత్రి యెడ్యూరప్పను ఆదేశించే అవకాశం ఉంది.

ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో భేటీ తర్వాత భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. శాసనసభలో ఉన్న శాసనసభ్యులందరూ పాల్గొనేలా బలపరీక్ష జరగాలనే విషయం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రుజువైందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బలపరీక్ష చేసుకోవాలని యెడ్యూరప్పను ఆదేశిస్తారా అని అడిగితే సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. అలా చెప్పడం తొందరపాటు అవుతుందని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టు తన తీర్పులో ముఖ్యమంత్రికి, స్పీకర్‌కు చురకలు అంటించిందని ఆయన చెప్పారు. ప్రధానిని తాను మర్యాదపూర్వకంగానే కలిశానని ఆయన చెప్పారు. కర్ణాటక రాజకీయాలు తాను ప్రధానితో మాట్లాడలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+