పౌరుషం ఆయనకే కాదు, కండబలం, డబ్బుతో గెలిచాడు: జగన్‌పై విహెచ్

V Hanumanth Rao
న్యూఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప ఉప ఎన్నికల్లో కండబలం, సానుభూతి, అవినీతి డబ్బుతో గెలిచారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. వైయస్, జగన్ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. వైయస్‌తో లాభం పొందిన వారు ఇప్పుడు జగన్‌కు మద్దతు పలుకుతున్నారన్నారు. గెలిచానన్న అహంభావంతో జగన్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ ద్వారా ఎదిగిన జగన్ సోనియాది నిరంకుశత్వం, ఎన్నికలు కాంగ్రెసుకు చెంపదెబ్బ అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని, జగన్‌లాగే కాంగ్రెసు కార్యకర్తలు కూడా ఇప్పుడు జగన్ వ్యాఖ్యలకు కాంగ్రెసు పౌరుషం చూపించాల్సిన సమయం వచ్చిందన్నారు.

రైతులపై జగన్ కపడ ప్రేమ చూపిస్తున్నారన్నారు. సోనియా ఆలోచన మేరకే వైయస్ రైతు పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. వేలాది ఎకరాల భూములను అప్పనంగా పెద్ద పెద్ద కంపెనీలకు అప్పగించి కోట్లాది రూపాయలు వైయస్ కుటుంబం సంపాదించిందన్నారు. అలాంటి జగన్ ఇప్పుడు రైతుల కోసం దీక్ష అనడం హాస్యాస్పదం అన్నారు. వేల ఎకరాల భూమిలు కొల్లగొట్టి రైతుల పొట్టగొట్టిన ఘనత వైయస్ కుటుంబానిదన్నారు. ఏళ్ల క్రింద కంపెనీలకు భూములు ఇచ్చినా ఇప్పటి వరకు ఇండస్ట్రీలు రాలేదన్నారు. జగన్ వర్గం మైనింగ్‌ను కూడా కొల్లగొడుతుందని దానిని ఆపాల్సిన బాధ్యత కాంగ్రెసుపై ఉందన్నారు. జగన్ తన పాపులారిటీ పెంచుకోవడానికే దీక్షలు చేస్తున్నారన్నారు. నెల్లూరు నుండి వైజాగ్ వరకు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఎన్ని వేల ఎకరల భూములు పంచి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారో జగన్‌ను ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు. వైయస్ హయాంలోనే రైతులు రోడ్డున పడ్డారన్నారు.

అన్నాహజారే బాటలో నడుస్తానని చెబుతున్న జగన్ తన ఆస్తులపై సొంతగా విచారణ జరిపించుకోవాలని డిమాండ్ చేశారు. వైయస్ ముఖ్యమంత్రి కాకముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో జగన్ తేల్చి చెప్పాలన్నారు. లక్షల నుండి వేల కోట్లకు ఎలా ఎగబాకారని ప్రశ్నించారు. గతంలో వైయస్ నా సహాయ సహకారాల వల్లే పిసిసి అధ్యక్షుడు అయ్యారన్నారు. అలాంటి వైయస్ కుటుంబం గురించి పూర్తిగా నాకు తెలుసని చెప్పారు. సోనియాను ఇటలీ నాయకురాలు అని విమర్శించడం సరికాదన్నారు. కడపలో గెలిచినంత మాత్రాన తనకు మాత్రమే ఇమేజ్ ఉందని, మరెవరికీ లేదనే అహంభావం జగన్‌లో కనిపిస్తుందన్నారు. ప్రాజెక్టుల పేరుతో రైతుల పొట్ట కొట్టిన వైయస్, జగన్‌కు కోట్లాది రూపాయలు ఇచ్చారన్నారు. సేకరించిన భూములు సెజ్‌లకు ఉపయోగపడుతున్నాయా లేదా అని త్వరలో అన్ని జిల్లాల్లో యాత్ర చేపడతానని చెప్పారు. జగన్ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆజాద్‌ను కోరనున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+