ముదురుతున్న బిజెపి, గవర్నర్ వివాదం: రాజ్ భవన్ ఎదుట పరేడ్

కాగా భరద్వాజ్ వైఖరిపై న్యూఢిల్లీలో మాజీ ప్రధాని ఎల్‌కె అద్వానీ ఇంటిలో బిజెపి ముఖ్య నేతలు సమావేశం అయ్యి చర్చించారు. అనంతరం అరుణ్ జైట్లీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గవర్నర్ భరద్వాజ్ తన బాధ్యతలు మరిచి రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశం ఏర్పర్చకుండా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్దం అన్నారు. కర్నాటకలో బిజెపి ప్రభుత్వానికి 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. అయినప్పటికీ గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం దారుణం అన్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి గవర్న తీరు వివరిస్తామని చెప్పారు. కర్నాటక ఎమ్మెల్యేలను రాష్ట్రపతి వద్దకు తీసుకు వెళతామని చెప్పారు. కాగా బెంగుళూరులో రాజ్ భవన్ వద్ద బిజెపి తన ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించింది.












Click it and Unblock the Notifications