గులాం నబీ ఆజాద్‌కు తెలంగాణ సెగ, వాదనకు నేతలు రెడీ

Ghulam Nabi Azad
హైదరాబాద్‌: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు తెలంగాణ సెగ తాకుతోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆజాద్ సోమవారం హైదరాబాదు వచ్చారు. ఆయన వద్ద తమ వాదన వినిపించేందుకు కాంగ్రెసు తెలంగాణ నాయకులు సిద్దమయ్యారు. ఆజాద్‌కు వినిపించాల్సిన వాదనలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శానససభ్యులు హైదరాబాదులోని గొల్కొండ హోటల్‌లో సమావేశమయ్యారు. తమ వాదనను ఆజాద్‌కు వినిపిస్తామని వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్య చెప్పారు. తెలంగాణ తమ ఏకైక ఎజెండా అని, తెలంగాణ గురించి మాత్రమే ఆజాద్‌తో మాట్లాడుతామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందనే నమ్మకం తమకు ఉందని, తెలంగాణ కోసం రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని మిర్యాలగుడా పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే ఈ ప్రాంతంలో పార్టీ మనుగడ సాగిస్తుందని రాజయ్య అన్నారు. ఈ విషయాన్ని ఆజాద్‌కు చెప్తామని ఆయన అన్నారు. కాగా, సీమాంధ్ర నాయకులు తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరడానికి, సమైక్యాంధ్రకే కట్టుబడాలని చెప్పడానికి సిద్ధపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+