చర్యలు తీసుకోకుంటే జగన్ వైపు మరికొంతమంది ఎమ్మెల్యేలు: వీరశివా రెడ్డి

కాంగ్రెసును వ్యతిరేకించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ వెంట వెళుతున్న వారిపై వేటు వేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలకు పార్టీ తరఫున, శాసనసభ తరఫున షోకాజ్ నోటీసులు ఇచ్చామని గుర్తు చేశారు. మిగతా ఎమ్మెల్యేలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ అధ్యక్షుడిని, పార్టీ విప్‌ను కోరారు. పార్టీ నిమిత్త మాత్రంగా వ్యవహరిస్తే జగన్ వెంట మరింత మంది ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గులాం నబీ ఆజాద్‌ను కోరనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications