వామపక్షాలతో వైయస్ జగన్ దోస్తీ: తెలంగాణకు మొండిచేయి

కాగా, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి వైయస్ జగన్ ముందుకు వస్తున్నారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సిపిఎం దోస్తీ సంకేతాలను ప్రత్యేకంగా గమనించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడంలో భాగంగా, జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా చేసే చర్యలో భాగంగా సిపిఎం దోస్తీకి సిద్ధపడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. పైగా, ప్రజలు అనుకూలంగా ఉన్నా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు జగన్‌కు లేదని చెప్పవచ్చు.
వైయస్ జగన్ వెంట ఉన్న ప్రధాన నాయకులు చాలా మంది తెలంగాణకు వ్యతిరేకమే. జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగానే ఉన్నారు. జూపూడి ప్రభాకర రావు ఇటు తెలంగాణకు అటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకం. దీంతో తెలంగాణకు అనుకూలంగా జగన్ నిర్ణయం తీసుకోకుండా చూడడానికి సిపిఎం కూడా రంగంలోకి దిగుతోందని భావించవచ్చు.












Click it and Unblock the Notifications