నన్ను చూశాకే రైతులు గుర్తొచ్చారా: దీక్షలో జగన్ టార్గెట్ చంద్రబాబే

YS Jagan
గుంటూరు: రైతు దీక్ష ముగింపు సమయంలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. 48 గంటల జగన్ దీక్షను గుంటూరుకు చెందిన వెంకటసూరయ్య అనే రైతు నిమ్మరసం ఇచ్చి విరమింప జేశారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు ఇప్పుడు రైతుల సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. భారత దేశంలో వ్యవసాయం దండుగ అన్న ముఖ్యమంత్రి, రైతులు తిన్నది అరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న ముఖ్యమంత్రి కేవలం చంద్రబాబే ఒక్కరే అని విమర్శించారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనన్న చంద్రబాబుకు వైయస్ ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించారన్నారు. అప్పుడు కుదరదన్న బాబు అధికారం కోసం ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తానని రైతులను నమ్మించాలని చూస్తున్నారని అన్నారు. తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి రైతుల కోసం పోరాటం చేయడం చూసిన తర్వాతే చంద్రబాబుకు రైతులు గుర్తుకు వచ్చారన్నారు. రైతు సమస్యలపై తాను దీక్ష చేస్తానని చెప్పగానే చంద్రబాబు కూడా రైతు సమస్యలపై దీక్ష ప్రారంభిస్తానని చెప్పారన్నారు.

కడపలో తాను ఎన్నికలు ఉన్నందున తిరిగానని, మరి చంద్రబాబు నాలుగు రోజులు మాత్రం కడపలో తిరిగి మిగిలిన రోజులు ఏసి గదిలో నిద్రపోయారన్నారు. తనను ఓడించడానికి టిడిపి, కాంగ్రెసు ఏకమయ్యాయయని ఆరోపించారు. తన పేరు వింటేనే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారన్నారు. చంద్రబాబుకు 18 ఏళ్ల పాటు రైతులు గుర్తుకు రాలదేని ఇప్పుడు ఎలా గుర్తుకు వచ్చారని ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సిగ్గులేని ప్రభుత్వం అన్నారు. వ్యవసాయాన్ని, రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెసు ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకే దీక్ష చేశానని స్పష్టం చేశారు. వైయస్ మృతి చెంది దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా రాష్ట్రంలో ఏ నేతకు రైతు కళ్లలో ఆనందం చూపి వారికి దగ్గరకు కావాలనే ఆలోచన లేదన్నారు. పంజాబ్ ప్రభుత్వంలా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం తనను ఎలా అణగదొక్కాలనే విషయంపైనే దృష్టి సారిస్తుందన్నారు.

సిఎం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో పది శాతం ప్రయత్నం చేసినా రైతులు సంతోషంగా ఉండేవారన్నారు. రైతుల చిరు నవ్వులు చూడని ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినా సిగ్గు రాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వానికి మనసు ఇవ్వాలని తాను దేవుడిని కోరుకుంటున్నానన్నారు. మళ్లీ మనం దివంగత వైయస్ పాలన తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తవగానే పెట్రోలు ధరలు పెంచి సామాన్యులను దొంగ దెబ్బ తీశారన్నారు. రైతు సమస్యలను తీర్చాలని లక్షలాది మందిగా ఏకమై రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను శ్రీరాముని రాజ్యం అయితే చూడనప్పటికీ వైయస్ రాజశేఖరరెడ్డి సువర్ణ పాలన చూశానని చెప్పారు. వైయస్ చేసిన ఐదేళ్ల పాలనలో రైతులు ఆనందంగా జీవించారన్నారు. రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందన్నారు.తన దీక్ష రైతుల సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు పోతుందనే తాను భావిస్తున్నట్టు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+